Saturday, December 27, 2008

ప్రేమ అనే ఎండమావి

జీవితమనే ఎడారిలో
ఒంటరి బాటసారిని నేను
నిప్పులు కక్కుతున్న ఇసుకలో
కాలిన గాయాలతో
ఒంటరిగా ప్రయాణిస్తున్నాను
తడి ఆరిన గొంతుకకు
ప్రేమ అనే ఒయాసిస్
కనిపించింది
ఎంత పయనించినా
దానిని చేరలేకపోయాను
అప్పుడే తెలిసింది
అదంతా ఒక భ్రమ అని
అదొక ఎండమావి అని.

Monday, December 22, 2008

రామక్రృష్ణ బీచ్





ఒడ్డున కూర్చుని
సముద్రాన్ని చూస్తే
అందంగా ఉంటుంది

మధ్య మధ్య రాళ్ళతో
దూరంగా ఉన్న ఓడలతో
చల్లని వెన్నెల చంద్రునిలా
ఒయ్యారంగా ఉంటుంది

అప్పుడప్పుడు అలలతో
ఆడుకుంటున్న కొందరిని
మింగేస్తుంటుంది

Sunday, December 21, 2008

కలల కల్లలు

నీ మాటల సవ్వడిలో మరపింపచేస్తూ
నీ కనుచూపులతో అల్లరి చేస్తూ
చిరుగాలికి చెదరిన కురులను మునివేళ్ళతో తీస్తూ
ఎగసిన పైటను సర్దుకుంటూ
చెదరని చిరునవ్వుతో పలుకరిస్తూ
నన్ను తోడుగా రమ్మని సైగ చేసావు
నీ అడుగులో అడుగునై సాగిపోదామనుకుంటే
కలల లాంటి అలలు కల్లలు చేసాయి.

Thursday, December 18, 2008

ఆత్మ విశ్వాసం



భీడు పడ్డ్ భూమిని చూసి
మేఘం వర్షాన్ని ఇచ్చింది

సూర్యుని తాపాన్ని చూడలేక
రాత్రి చల్లని వెన్నెలను ఇచ్చింది

మునిగిపోతున్న మనిషిని
ఒక సముద్రపు అల ఒడ్డుకు తెచ్చింది

వైఫల్యాలు నిండిన మనిషికి
ఆత్మవిశ్వాసం విజేతగా నిలుపుతుంది